మాజీ సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రహ్లద్ నిహ్లాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న చిత్రం జూలీ2. రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం ఓ నటి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందని ప్రహ్లద్ చెప్పడంతో ఆ నటి నగ్మానే అయి ఉంటుందని దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ మేటర్ నగ్మాకి కూడా చేరడంతో దీనిపై ఘాటుగా స్పందించింది. తొలిసారి నా జీవిత కథతో సినిమా అని వింటున్నానని, ఇప్పుడు చేయగలిగింది ఏమి లేదు, సినిమా రిలీజ్ అయ్యాక ఏం చేయాలో ఆలోచిస్తానని అంది. తన పేరుతో పబ్లిసిటీ స్టంట్స్ చేసేంతగా దిగజారిపోతారని నేను అనుకోలేదంటూ నగ్మా చెప్పింది. మరి సినిమా రిలీజ్ తర్వాత నగ్మా దీనిపై ఎలా స్పందిస్తుంది అన్నది పూర్తి సస్పెన్స్ గా మారింది. తమిళం, హిందీ భాషలలో రేపు విడుదల కానున్న జూలీ2 చిత్రంలో రతి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్తవ, రవి కిషన్, పంకజ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ముఖ్య పాత్రలు పోషించారు . బాలీవుడ్ లో ఉన్న చీకటి కోణంతో పాటు అండర్ వరల్డ్ మరియు రాజకీయాలలో ఉన్న నగ్న సత్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుందని తెలుస్తుంది
Mon Jan 19, 2015 06:51 pm