సియోల్: సైనికుడి కడుపులో ఉన్న పరాన్నజీవులను చూసి డాక్టర్లు స్టన్ అవుతున్నారు. ఇంత పెద్ద, పొడువైన పరాన్న జీవులను తాము ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతున్నారు. బుల్లెట్లు దిగిన సైనికుడికి చికిత్స చేస్తున్న సమయంలో పరాన్నజీవులు ఉన్నట్లు కనుగొన్నారు. పరాన్నజీవులు రకరకాలుగా ఉన్నాయని, ఓ పురుగు సుమారు 27 సెంటీమీటర్లు.. అంటే సుమారు 10 ఇంచులు ఉన్నట్లు గుర్తించారు. తన 20 ఏళ్ల సర్వీస్‌లో ఇలాంటి పురుగులను ఎప్పుడూ చూడలేని డాక్టర్ లీ కుక్ జాంగ్ తెలిపారు. పట్టబడ్డ ఉత్తర కొరియా సైనికుడికి హెపిటైటిస్ బి కూడా ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం సైనికుడి పేగుల నుంచి అన్ని పరాన్న పురుగులను తొలిగించినట్లు డాక్టర్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm