హైదరాబాద్ : ప్రియుడి మాటలు నమ్మి.. ఫేస్బుక్లో నగ్నంగా చాట్ చేసిన యువతికి షాక్ ఇచ్చాడు రియుడు. ఇది ఎక్కడో జరిగింది కాదు.. మన తెలుగు రాష్టాలలోని తెలుగు అమ్మాయికి జరిగిన విషయమే. ఆ యువతి తెలంగాణలోని నకిరేకల్ మండలానికి చెందిన బాధితురాలు. ఆ వివరాళ్ళలోకి వెళితే.. తెలంగాణలోని నకిరేకల్ మండాలానికి చెందిన సదరు యువతికి ఫేస్ బుక్ లో ప.గో.జిల్లాకు చెందిన యువకుడు పరిచయం అయ్యాడు. ఆ యువకుడు దుబాయ్లో ఉంటూ.. ఆమెతో ఫేస్బుక్ ద్వారా పరచయం పెంచుకున్నాడు. దుబాయ్ లో ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటున్న అతడు ఆమెను ప్రేమిస్తున్నాను అని వెంట పడుతూ చాటింగ్లో వేదించేవాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు, విదేశంలో ఉన్నాడు.. తన జీవితం బాగుంటుందని భావించిన ఆ యువతి.. అతనితో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకుంది. అక్కడ నుంచి వీళ్లిద్దరూ క్లోజ్ అయిపోయారు. అతడు చెప్పిందల్లా ఆమె చేస్తూ వచ్చింది. అయితే.. వారి స్నేహం కాస్తా శృతి మించింది. అతను తన ముందు నగ్నంగా నిలబడాలని కోరగానే.. అతన్ని బాధపెట్టడం ఇష్టం లేక.. ఫేస్బుక్లో చాట్ చేసుకొంటూ అతడికి తన నగ్న రూపాన్ని కూడా చూపిందామె. అతడి కోరిక మీద బట్టలు విప్పి.. వీడియో చాట్ చేసింది. అయితే అప్పటి దాకా బాగానే ఉన్న అతను ఆమె నగ్న వీడియోలను రికార్డు చేసి నెట్లో పెట్టానని చెప్పాడు.. దీంతో ఏనాటికైనా అతడితో ప్రమాదమే అని అర్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. అతను దుబాయ్ నుంచి వచ్చే వరకూ వేచి చూసి.. ముంబై ఎయిర్ పోర్టులోనే అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
Mon Jan 19, 2015 06:51 pm