కర్ణాటక : ఈ వీడియోలో కర్ర పుచ్చుకుని ఓ యువకుడిని కొడుతున్న ఇతను ఓ ఎమ్మెల్యేగారి పుత్రరత్నం. ఆ ఎమ్మెల్యే సా రా మహేష్. జనతాదళ (ఎస్) పార్టీకి చెందిన మహేష్ కర్ణాటకలోని మైసూరు కృష్ణరాజ నగర అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన కుమారుడు జయంత్ తన స్నేహితులతో కలిసి ఓ యువకుడిని నిర్బంధించి కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
బెంగళూరులో గుర్తు తెలియని ప్రదేశంలో బాధిత యువకుడిని నిర్బంధించి, తన స్నేహితులతో కలిసి ఆ యువకుడిని తీవ్రంగా కొట్టారంటూ చెబుతున్నారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తరువాత ఎస్ఆర్ మహేష్ స్పందించారు. ఈ వీడియోను రాజకీయ దురుద్దేశంతో చిత్రీకరించారంటూ ఆయన ఆరోపిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 23,2017 06:35PM