హైదరాబాద్: నగరంలోని పెద్దఅంబర్‌పేట వద్ద ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న ఓ కారు.. మరో కారును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా... మరో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే సన్‌షైన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm