విశాఖ: ఆర్కే బీచ్ సమీపంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఫూటుగా మందు కొట్టి ముగ్గురు యువకులు కారులో ప్రయాణించారు. బీచ్ వద్ద స్కేటింగ్ పోటీలు జరుగుతుండగా మితిమీరిన వేగంతో కారు అక్కడికి దూసుకెళ్లింది. పోటీల నిర్వాహకులు వెంబడించి మరీ కారును ఆపడంతో పెను ప్రమాదమే తప్పింది. కారులో ప్రయాణిస్తున్న యువకులు మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మందు సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm