హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేరగాళ్లపై సమగ్ర సర్వే కొనసాగుతుంది. సమగ్ర సర్వేలో డీజీపీ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు పాల్గొన్నారు. నేరస్థులు, నేర ప్రవృత్తి కలిగిన వారిని గుర్తించి జియోట్యాగింగ్ ద్వారా నిఘాకు సన్నద్ధం చేస్తున్నారు. పోలీస్స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న నేరస్థుల వివరాలు సేకరిస్తున్నారు. నేరస్థుల గత చరిత్ర, ప్రస్తుత పనుల సమాచారాన్ని టీఎస్ కాప్ మొబైల్ యాప్లో నిక్షప్తం చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm