మహబూబాబాద్: సాధించాలనే తపన ఉంటేనే విజయం మనకు దాసోహమవుతుందని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి హితబోధ చేశారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న కానిస్టేబుల్ పోటీ పరీక్షల అభ్యర్థుల ఉచిత కోచింగ్ క్యాంపును ఎస్పీ ఇవాళ సందర్శించారు. విద్యార్థులు తమ ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేలా పాజిటివ్ థింకింగ్ గురించి ఆయన మాట్లాడారు. పోటీ పరీక్షలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను ఆయన అభ్యర్థులను అడిగారు. ఇప్పుడు కష్టపడితేనే జీవితంలో మంచి స్థానంలో ఉంటామని ఆయన హితబోధ చేశారు. తాను ఈ స్థాయిలోకి రావడానికి ఎంతో కష్టపడ్డారో అభ్యర్థులకు వివరించారు. ఈ క్యాంపుకు ప్రతి రోజు 250 పైన విద్యార్థులు హాజరవుతారని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm