మాస్కో: రష్యాలోని ఓ స్కూల్లో టీనేజి విద్యార్థి గొడ్డలితో తోటి విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా ఏకంగా స్కూల్కు నిప్పంటించాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఉలన్ ఉడే నగరంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఏడో తరగతి విద్యార్థులపై కత్తితో దాడి చేశాడు. తర్వాత తరగతి గదికి నిప్పంటించాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనలో ఐదుగురు విద్యార్థులు, ఓ టీచర్ గాయాలపాలయ్యారు. కొద్ది రోజుల క్రితం రష్యాలోని పెర్మ్ నగరంలోని పాఠశాలలో కత్తులతో దాడి జరగ్గా 15 మంది గాయపడ్డారు. ఇద్దరు ముసుగు వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్లు తొలుత పోలీసులు భావించారు. కానీ తర్వాత ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ పెద్ద ఘర్షణగా మారినట్లు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm