హైదరాబాద్: ఆర్కే నగర్ ఉపఎన్నికలో ఒక రాజకీయవేత్తగా తాను పోటీ చేయలేదని... ఆ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగానని హీరో విశాల్ అన్నాడు. రాజకీయరంగంలోకి దిగాలనే తన నిర్ణయానికి కారణమైనవారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పాడు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమిళనాడులో పెను మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపాడు. రానున్న రోజుల్లో తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని విశాల్ స్పష్టం చేశాడు. ఆర్కే నగర్ ఉపఎన్నికలో తన నామినేషన్ విషయంలో అన్యాయం జరిగిందని... తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆ అవకతవకలే కారణమని చెప్పాడు.
Mon Jan 19, 2015 06:51 pm