న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేకు చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. 'పద్మావత్' సినిమాకు సంబంధించి ఆ చిత్ర నిర్మాతల తరపున సుప్రీంకోర్టులో సాల్వే వాదనలు వినిపించారు. దీంతో, రాజ్ పుత్ కర్నిసేనకు సంబంధించిన వ్యక్తులు ఈ బెదిరింపులకు దిగారు. 'పద్మావత్'కు అనుకూలంగా వాదించినందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అంటూ ఫోన్ ద్వారా బెదిరించారు. అంతేకాదు, దమ్ముంటే పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాలని కూడా సవాల్ విసిరారు. ఈ విషయాన్ని మీడియాకు స్వయంగా సాల్వే తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm