హైదరాబాద్ : రోడ్డుపై ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతో వారి వెనుక నుంచి ఇద్దరు బైక్ మీద వచ్చి ఓ యువతి పర్సును దొంగలించే ప్రయాత్నం చేశారు. అయితే అ ప్రయాత్నంలో అ ఇద్దరు దొంగలను బైక్ మీద నుంచి కింద పడిపోయారు. వెంటనే అ యువతి ఆ ఇద్దరు దొంగలను పట్టుకుని చితకబాదింది. ఇంతలో అక్కడ ఉన్న స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన పాకిస్తాన్లోని రావల్పిండిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Mon Jan 19, 2015 06:51 pm