కడప: కడపలోని ఒంటిమిట్ట చెరువులో ఆరు మృతదేహాలను స్థానికులు గుర్తించారు. చెరువులో ఆరు మృతదేహాలు తేలుతుండటాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాల వివరాలు తెలియాల్సి ఉంది. బలవన్మరణమా? లేక హత్య? జరిగిందా అనే దానిపై స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm