ఎన్టీఆర్ మరోసారి మరుపురాని క్షణాలను ఆస్వాదించబోతున్నారు. ఎన్టీఆర్ మళ్లీ తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. తారక్-ప్రణతి దంపతులకు 4ఏళ్ల అభయరామ్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. మే నెలలో వీరి కుటుంబంలోకి మరొకరు రాబోతున్నారని సమాచారం.
ఎన్టీఆర్ ప్రస్తుతం తివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఆయన రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మల్టీస్టారర్లోనూ నటించబోతున్నారు. ఇందులో మరో కథానాయకుడిగా రామ్చరణ్ నటిస్తు్న్నారు. మే నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 04:42PM