కోయంబత్తూర్: సాధారణంగా కోతులు, రామచిలుకలు, మైనా పక్షులు లాంటి మూగజీవాలకు మనం ఎలా శిక్షణ ఇస్తే అవి అలా నేర్చుకుంటాయి. మనుషుల లాగా అవి కొన్ని పనులు చేస్తుంటే మనకెంతో ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంటుంది. తాజాగా కోయంబత్తూర్లో ఓ ఏనుగు మౌత్ ఆర్గాన్ను వాయిస్తూ ఆందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ ఏనుగు పేరు ఆండాల్.
ఏనుగుల ఆరోగ్య సంరక్షణ, పునరుజ్జీవనం కోసం 48 రోజుల పాటు ఓ భారీ వైద్య శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. జనవరి 4న ప్రారంభమయిన ఈ వైద్య శిబిరం ఈ నెల 20తో ముగుస్తుంది. ఏనుగుల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది నిర్వహించిన శిబిరంలో లక్ష్మి పేరున్న 11 ఏళ్ల ఏనుగు కూడా మౌత్ ఆర్గాన్ పరికరాన్ని వాయించి ఔరా అనిపించింది. ఆ ఏనుగు ఏడాది వయసున్నప్పటి నుంచే ఆ వాద్య పరికరాన్ని వాయిస్తుండటం విశేషం
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 18,2018 06:00PM