ఇస్లామాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్ వూర్తి వ్యతిరేకమని,, ఆఫ్గన్‌లో అమెరికా వైఫల్యాలకు పాకిస్థాన్‌ను ఎందుకు నిందిస్తున్నారని పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ఖమర్ బజ్వా అమెరికాపై ధ్యజమెత్తారు. అగ్రరాజ్యం ఇతర దేశాలపై నిందలు మోపడం ఆపేసి తమ వైఫల్యానికి గల కారణాలను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఎదుర్కొంటున్న భద్రతా పరమైన సమస్యలపై జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతోన్న మూడు రోజుల సదస్సులో భాగంగా ఆయన మాట్లాడారు. జమాత్- ఉల్- అహ్రార్, తెహ్రీక్-ఇ-తాలిబన్ల గురించి ప్రస్తావిస్తూ వీరు అఫ్గన్- పాకిస్థాన్ సరిహద్దుల్లో వారి స్థావరాలను ఏర్పరచుకున్నారని, పాకిస్థాన్‌లో కాదని, ఉగ్రవాదుల దాడిలో పాకిస్థాన్ కూడా ఎంతో నష్టపోయిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm