హైదరాబాద్: 'బిగ్ బాస్' సీజన్ -1కు వ్యాఖ్యాతగా ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించిన విషయం తెలిసిందే. తన హావభావాలతో, డైలాగ్స్ తో ఆ షోను ఎంతో రక్తికట్టించాడు.'బిగ్ బాస్' సీజన్ -1కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో, సీజన్ -2 ను ప్రారంభించాలని నిర్వాహకులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే, ఈ సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించట్లేదు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండటంతో జూనియర్ ఎన్టీఆర్ బిజీ కానున్నాడు. దీంతో, 'బిగ్ బాస్' సీజన్ -2లో చేసేందుకు తనకు కుదరదని ఎన్టీఆర్ చెప్పేశారు.
ఈ నేపథ్యంలో, వ్యాఖ్యాతగా ఎవరిని ఉంచితే బాగుంటుందని నిర్వాహకులు బాగా ఆలోచించిన మీదట ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సహజనటుడు నానిని ఎంచుకున్నట్టు, ప్రస్తుతం అతనితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కాగా, ఇటీవల జరిగిన ఐఫా ఉత్సవంలో నటుడు రానాతో కలిసి నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 19,2018 06:48AM