కరీంనగర్: నగరంలోని సినిమాహాళ్లపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్, తూనికలు, కొలతలశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. వెంకటేశ్వర, సాయికృష్ణ, మమత హాళ్లలోని క్యాంటిన్లలో సోదాలు నిర్వహించారు. అధిక ధరలకు తినుబండారాలు అమ్ముతున్న క్యాంటిన్లపై కేసు నమోదు చేశారు. ఒక్కో క్యాంటిన్‌కు రూ.5వేల చొప్పున జరిమానా విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm