హైదరాబాద్: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, హక్కుల సాధన కోసం ఏపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు మధ్యాహ్నం 3గంటలకు చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ఆంధ్రుల ఆత్మ గౌరవ దీక్షలో ఏపీసీసీ అధ్యక్షులు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి పాల్గొననున్నారు. రఘువీరారెడ్డి మాట్లాడుతూ .. రాజకీయాలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా అందరం కలిసి మన హక్కులను సాధించుకుందామని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకుందామని అన్నారు. ఈ దీక్షలో ఏపీసీసీ సీనియర్ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు పాల్గొంటారని అన్నారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఈ దీక్షని విజయవంతం చేయాలని రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm