హైదరాబాద్ : చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన స్మార్ట్ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను నియమించుకుంది. ఈ విషయంపై అమీర్‌ఖాన్ ఇప్పటికే తమ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని వివో ఇండియా ఇవాళ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ ద్వారా తెలియజేసింది. దీంతో వచ్చే వారం విడుదల కానున్న వివో వీ9 స్మార్ట్ఫోన్తోపాటు భవిష్యత్‌లో విడుదల కానున్న అన్ని వివో ఉత్పత్తులకు అమీర్‌ఖాన్ ప్రచారకర్తగా ఉంటారని, త్వరలో ఓ కొత్త టీవీ యాడ్లోనూ అమీర్ నటిస్తారని వివో పేర్కొంది. రెండేళ్ల కాలానికి గాను బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌తో తాము కుదుర్చుకున్న ఒప్పందం గత నెల కిందటే ముగిసిందని, అందుకే ఆయన స్థానంలో అమీర్‌ఖాన్‌ను తమ ఫోన్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వివో ఇండియా సీఎంవో కెన్నీ జెంగ్ తెలిపారు. వివో ఉత్పత్తుల ప్రచారానికి అమీర్‌ఖాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని, ఇది తమ కస్టమర్ బేస్‌ను మరింత పెంచుతుందని కెన్నీ జెంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm