ప్లాస్టిక్ బాక్సుల్లో భోజనం చేసే వారిలో జుట్టు ఊడిపోతుందని బెంగుళూరుకు చెందిన హెయిర్ లైన్ ఇంటర్నేషనల్ అనే రీసెర్చ్ సెంటర్ పరిశోధన తెలిపింది.
ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారపు అలవాట్లు రక్తంలో బీపీఏ పెరిగేందుకు కారణమవుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు ప్లాస్టిక్‌తో తయారు చేసినవి కావడం వల్లనే వారిలో జుట్టు సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయని అంటున్నారు.
ఈ పరిశోధనలో ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాన్ని తెచ్చుకుని తినేవారిలో 20నుండి 45సంవత్సరాల వయసు ఉన్న ఉద్యోగుల్లో దాదాపు 430మంది యువతులు, 570మంది పురుషులపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. హెయిర్ లాస్ సమస్యతో చికిత్సలకు వస్తున్న వారిలో 92శాతం మంది రక్తం, యూరిన్ శాంపిళ్లలో ప్లాస్టిక్ (బీపీఏ - బిస్పెనాల్ ఏ) అధికంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ బీపీఏను కొన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వాడతారు.
అంతేకాదు, మైక్రోవేవ్‌లలో వాడే ప్లాస్టిక్ బాక్సుల ద్వారా కూడా శరీరంలోకి మరింత ప్లాస్టిక్ చేరుతోందని అపోలో హాస్పిటల్ క్లినికల్ డైటీషియన్ చీఫ్ ప్రియాంకా రోహతి అభిప్రాయపడ్డారు. అందుకే వీటన్నింటికి ప్రత్యామ్మాయంగా స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులను వాడాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 19,2018 08:30PM