బరువు తగ్గేందుకు ఏమేం చేయొచ్చో.. అవన్నీ చేసినా ఫలితం లేదుః అంటుంటారు కొందరు. మీ పరిస్థితి కూడా అదేనా.. అయితే ఇకపై ఈ ప్రయోగాలు చేసి చూడండి. కచ్చితంగా మీలో మార్పు కనిపిస్తుంది.
కదలకుండా గంటల కొద్దీ కూర్చోవడం వల్ల క్యాలరీలు కరగవు. శరీరం చురుకుదనాన్ని కోల్పోతుంది. అందుకే వీలైనంత వరకు ఎక్కువసేపు నిల్చునేందుకు ప్రయత్నించండి. పేపరు చదువుతూ కావచ్చు, ఫోను మాట్లాడుతూ కావచ్చు.. వీలైనంత వరకు నిల్చోవడం వల్ల క్యాలరీలు కరుగుతాయి.
ఆహారం తీసుకుంటున్నప్పుడు సంగీతం వినడం అలవాటు చేసుకోండి. దానివల్ల నిదానంగా తింటాం. కొద్ది కొద్దిగా కూడా తీసుకుంటాం. వ్యాయామం చేస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు సంగీతం వినాలి. ఫలితంగా ఎక్కువ సేపు ఉత్సాహంగా, వేగంగా వ్యాయామం చేయగలుగుతాం.
పొద్దున్నే నిద్రలేచే అలవాటుందా..? అయితే కనీసం అరగంట నడిచేందుకు ప్రయత్నించండి. లేదంటే సైకిలు తొక్కండి. రోజూ ఇలా చేయడం వల్ల శరీరాకృతిలో మార్పొస్తుంది. ఆరు బయట వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్లూ విడుదల అవుతాయి. వ్యాక్యూమ్ క్లీనర్ వంటి ఎలట్రానిక్ ఉపకరణాలు అందుబాటులో ఉన్నా.. నిల్చుని బూజు దులపడం, వంగి నేల తడవడం చేస్తుండాలి. ఈ పనుల వల్ల తెలియకుండానే ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 19,2018 09:50PM