హైదరాబాద్ : విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'టాక్సీవాలా'. గీతా ఆర్స్ట్ 2, యువీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్కెఎన్ నిర్మాత. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. విజయ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఉండే అంచనాలకు తగినట్టుగా టాక్సీవాలా సినిమాను రూపొందిస్తున్నారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే 18న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ప్రొమోను 'టాక్సీవాలా ఫస్ట్ గేర్' పేరుతో ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది..ఈ ప్రొమోలో ఉషారుగా టాక్సీని డైవ్ చేస్తూ కనిపించాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ, ప్రియాంక జువాల్కర్, మాళవికా నాయర్, కల్యాణి, మధునందన్, రవిప్రకాష్, రవివర్మ, ఉత్తేజ్ ఇతర తారాగణం. సంగీతం జేక్స్ బిజాయ్, ఛాయాగ్రహణం సుజిత్ సారంగ్, స్క్రీన్ప్లే, మాటలు సాయికుమార్ రెడ్డి.
Mon Jan 19, 2015 06:51 pm