హైదరాబాద్ : ఫ్రాన్స్‌లో కలకలం చెలరేగుతోంది. కార్కాసన్ పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్లోకి ప్రవేశించిన ఓ దుండగుడు కాల్పులు జరుపుతున్నాడు. ఈ ఘటనలో ఓ పోలీసుకి గాయాలయ్యాయి. సూపర్ మార్కెట్లోని పలువురిని బందీలుగా తీసుకుని బెదిరిస్తున్నాడు. ఆ దుండగుడు ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ తుపాకీతో ఆ దుండగుడు ఇప్పటికి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడని అక్కడి అధికారులు తెలిపారు. సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఆ దుండగుడి చేతిలో బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm