హైదరాబాద్ : చంద్రబాబునాయుడుపై మోదీకి వ్యక్తిగత కక్ష ఉంటే బాబును జైల్లో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ, తెలుగు ప్రజలపై కక్ష ఎందుకు సాధిస్తున్నారు? అందువల్ల, ఏపీలో బీజేపీకి శాశ్వతంగా పునాదులు లేకుండా పోయే పరిస్థితులు తెచ్చిపెట్టుకున్నారు. కాగా, ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైనా ఆయన విమర్శలు చేశారు. కేసీఆర్ లాంటి వాళ్లు కూడా థర్డ్ ఫ్రంట్ పెడతామని అంటున్నారు! థర్డ్ ఫ్రంట్ ఇక్కడ ఏర్పాటు చేస్తామంటారు, అక్కడికి వెళ్లి బీజేపీని సపోర్టు చేస్తారు! కేంద్రంలో ఏమో కేసీఆర్ శిఖండి పాత్ర..తెలంగాణకు వచ్చేసరికి అర్థనారీశ్వర పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి మోసపూరిత వైఖరి తెలంగాణలో నడుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm