అందంగా కనిపించడానికి ఎన్నో రకాల క్రీములు, పౌడర్లను వాడుతుంటారు. అయితే వీటి వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సహజ సిద్ధంగా కొన్ని పండ్లను ఆహారంగా తీసుకుంటే అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
అరటి: అరటి పండు రోజూ తింటే ఆరోగ్యానికి, అందానికి చాలా మంచిది. దాంట్లో ఉండే విటమిన్ 'బి' చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మృత కణాలను తొలగిస్తుంది.
బొప్పాయి: బొప్పాయి పండులో విటమిన్ 'సి' సమృద్ధిగా ఉంటుంది. దీన్ని ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు. అలాగే చర్మ సమస్యలను తొందరగా దూరం చేస్తుంది.
ఎండు ద్రాక్ష: ప్రతి రోజూ రెండు లేదా మూడు ఎండు ద్రాక్ష పండ్లు తినాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి నెల పీరియడ్ సమస్యలతో బాధపడే వారు ఇవి తీసుకుంటే సరిపోతుంది. ఈ పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చర్మం తొందరగా ముడుతలు పడకుండా కాపాడుతాయి.
దానిమ్మ: దానిమ్మలో ఎక్కువగా కెరోటినో సైడ్స్ ఉంటాయి. ఇవి చర్మం ముడతలు పడకుండా కాపాడుతాయి. అందంగా కనిపించాలంటే తప్పని సరిగా దానిమ్మ తీసుకుంటే మంచిది.
స్ట్రాబెర్రీలు: బెర్రీలు, బ్లూ బెర్రీలు తీసుకోవాలి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా తయారు చేస్తాయి. వీటిలో విటమిన్ 'సి' సమృద్ధిగా ఉంటుంది
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 23,2018 08:35PM