గుడ్డులో ఆరోగ్యానికి సంబంధించిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. అలాగే ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఒక గుడ్డు తింటే 12 శాతం ఒత్తిడి తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు. గుడ్డులో ప్రొటీన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ల్యూటిన్, విటమిన్ 'ఇ', 'డి', 'ఎ' లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా గుడ్డులోని తెల్లసొనలోనే అత్యధికంగా ఉంటాయి.
గుడ్డులో ఎన్నో చెప్పుకోదగ్గ న్యూట్రీన్లు ఉన్నాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి. అలాగే పాజిటివ్ థింకింగ్‌ను పెంచుతాయి. ఇవి ఆందోళనను, ఒత్తిడిని తగ్గిస్తాయి. అధిక ఒత్తిడిని తగ్గించటంలో వీటి పాత్ర కీలకం.
ఒక సర్వే నిర్వహించిన వివరాల ప్రకారం 3,08,000మందిపై పరిశోధనలు జరపగా వారిలో 2,76,000 మంది గుడ్డును రోజూ తీసుకుంటున్నారు. వారిలో ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు లేవు. గుడ్డును ఆహారంలో తీసుకోని వారు కెరోనరీ అనే గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నారని ఈ సర్వే ద్వారా తెలిసింది.
పరిశోధనల ప్రకారం గుండె జబ్బులను తగ్గించటంలో దీని పాత్ర కీలకం. అందుకే ఇది కచ్చితంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహార పదార్థం.
అమ్మాయిల్లో హార్మోన్లు సమతుల్యతను కాపాడుతుంది. అలసటను దూరం చేసి మంచిగా నిద్రపోయేలా చేస్తుంది.
గుడ్డులో ఉండే తెల్లసొన ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది.
గుడ్డుతో పాటు పాలు కూడా రోజూ ఉదయం లేదా సాయంత్రం డైట్‌లా తీసుకుంటే మంచిది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Mar 23,2018 08:44PM