ప్లాస్టిక్ వస్తువుల్ని లంచ్ బాక్సులుగా ఉపయోగిస్తున్నారా? అయితే కచ్చితంగా జుట్టు వూడిపోతుందని హెయిర్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ కార్యాలయాలకు ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహారం నింపుకెళ్లే వారికి ఈ సమస్య తప్పదని నిపుణులు ఈ మధ్యే గుర్తించారు. అలాగే స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ప్లాస్టిక్ బాక్సుల్లో ఆహారాన్ని పెట్టి పంపడం ద్వారా చిన్న వయసులోనే పలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని కూడా అధ్యయనంలో తేలింది. ఇంకా ప్లాస్టిక్ కప్పుల వాడకం వల్ల క్యాన్సర్ కారకాలు వ్యాపిస్తున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికన్ పరిశోధనల్లో ప్లాస్టిక్‌లోని కెమికల్స్ బ్రెస్ట్ క్యాన్సర్‌కు కారణమవుతుందని, ఇంకా స్పెర్మ్ కౌంట్‌ను కూడా తగ్గిస్తుందని తేలింది. ఇంకా పిల్లలు, గర్భిణీ మహిళల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అందుకే స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్లు, వాటర్ బాటిల్స్ ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. మరి ఇకనైనా జాగ్రత్త తీసుకోండి.
Mon Jan 19, 2015 06:51 pm