హైదరాబాద్ : బీజేపీకి, కాంగ్రెస్కు అతీతంగా మూడో కూటమిని నిర్మించడం అంత తేలికైన విషయం కాదని సీపీఎం అగ్ర నేత ప్రకాశ్ కారత్ చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించేందుకు తాము గట్టి ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇటీవల వెలువడ్డ ఉప ఎన్నికల ఫలితాలు తమకు మంచి పాఠం నేర్పాయని, బీజేపీని కాంగ్రెస్ ఓడించగలిగే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో తాము కాంగ్రెస్కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. బీజేపీని ఓడించేందుకు ఎన్నికల వ్యూహాలకు సంబంధించి మంచి పాఠాలను ఆ ఉప ఎన్నికలు తమకు అందించాయని, బీజేపీయేతర పార్టీల్లో ముఖ్యమైన పార్టీలన్నీ కలిస్తే మిగతా చిన్న పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తాయని అభిప్రాయపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm