హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఆలూమ్ని అసోసియేషన్ (పూర్వ విద్యార్థుల సంఘం) సహకారంతో కళాశాలలో కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌ను ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఉపాధి అవకాశాలు దక్కించుకునేందుకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే వ్యవస్థలో వస్తున్న మార్పులకనుగుణంగా ఎప్పటికప్పుడు విద్యార్థులు సంసిద్ధులుగా ఉండాలన్నారు. ఓయూఈసీ ఆలూమ్ని అసోసియేషన్ చైర్మెన్ రామిరెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థులుగా తమ వంతు సహకారాన్ని విద్యార్థులకు అందజేస్తూ, పలు కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఓయూ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. కెరియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులకు పలు వర్క్‌షాప్‌లు, సదస్సులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm