కేప్‌టౌన్: ఆస్ట్రేలియా ఓపెనర్ కేమెరాన్ బెన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరికిపోయాడు. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న కేమరాన్ తన ప్యాంటులో ఏదో దాస్తూ కెమెరాలకు చిక్కాడు. అంపైర్లు కూడా దీనిని గమనించడంతో వారు వివరణ కోరారు. దీనికి కేమరాన్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడంతో తర్వాత ఆటకొనసాగించారు. అయితే అంపైర్లు ఏమడిగారు? అతడేం చెప్పాడన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. తన ప్యాంటులో ఏదో దాస్తున్న కేమరాన్ ఫొటోను దక్షిణాఫ్రికా క్రికెటర్ డేల్ స్టెయిన్ ట్వీట్టర్లో పోస్టు చేస్తూ 'దీని గురించి మనం మాట్లాడుకోవచ్చా?' అని రాసుకొచ్చాడు. దీంతో ఇది కాస్తా వైరల్ అయింది. రివర్స్ స్వింగ్ కోసం ఆసీస్ ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్ యత్నించారని, సఫారీ బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించాలని ఇలా అడ్డదార్లు తొక్కారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm