హైదరాబాద్ : భాషతో సంబంధం లేకుండా ప్రతీ చిత్రపరిశ్రమలోనూ మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. టాలీవుడ్లో కాస్టింగ్‌కౌచ్‌పై ఇటీవల పెద్ద ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బీబీసీ నిర్వహించిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలపై నటీమణులు ఉషా జాదవ్, రాధికా ఆప్టేలు మాట్లాడారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను చాలా లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని గతంలో జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన ఉషా జాదవ్ తెలిపింది. నేను పరిశ్రమకు వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అవకాశాలు కావాలంటే నిర్మాతలు, దర్శకుల దగ్గరకు వెళ్లాల్సిందేనని ఓ వ్యక్తి చెప్పాడు. ఓ దర్శకుడు నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నా శరీరంపై ఎక్కడపడితే అక్కడ చేతులేశాడు. ముద్దుపెట్టుకున్నాడు. అతడి ప్రవర్తనకు షాకైపోయాన-ని ఉషా వెల్లడించింది. ఇక, రాధిక మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులు ఉంటారని, ఏం చేసినా అడిగే వారెవరూ ఉండరని వారు భావిస్తుంటారని తెలిపింది. మహిళలతోపాటు పురుషులు కూడా కలిసి పోరాడితేనే కాస్టింగ్ కౌచ్‌కు పరిష్కారం దొరుకుతుందని రాధిక అభిప్రాయపడింది.
Mon Jan 19, 2015 06:51 pm