రైల్వే స్టేషన్లో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు అర్జున్. తర్వాత సేమ్ కాలేజీలో తను సీనియర్ అని తెలుస్తుంది. అయితే నేం ప్రేమకు సీనియర్, జూనియర్ తేడాలుంటాయా? అందుకే ఫాలో అయి ఒక రోజు తనకు ప్రపోజ్ చేస్తాడు. తను ఇగ్నోర్ చేస్తుంది. అంతలోపే అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయి తన ఊరెళ్తుంది. విషయం తెలుసుకున్న అర్జున్ అడ్రస్ పట్టుకుని అమ్మాయి ఊరెళ్తాడు. అక్కడ కూడా తనను ఫాలో అవుతూ ఉంటాడు. అదే పరిచయంతో కొన్ని రోజులకు ఇద్దరూ బాగా దగ్గరవుతారు. ఒక రోజు అమ్మాయికి పెండ్లి చూపులు జరుగుతాయి. అప్పటికే తను అర్జున్ను ప్రేమిస్తుంది కానీ విషయం చెప్పదు. పెండ్లి చూపులు ఇష్టం లేక అర్జున్ దగ్గరికి వెళ్లి తన ప్రేమ విషయం తెలపడంతో ఇద్దరూ ఒకటవుతారు. అయితే సడన్‌గా పెండ్లి చూపుల ప్రోగ్రామ్ ఏంటి అనేది క్లైమాక్స్‌లో తెలుస్తుంది. సీనియర్, జూనియర్ల మధ్య సాగిన ప్రేమ కథకు హ్యూమర్‌ని జోడించటంతో సినిమా బోర్ కొట్టకుండా సాగుతుంది.
సినిమాలో పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించారు. ఎమోషనల్ సీన్స్‌లో అమ్మాయి నటనలో మెర్చురిటీ కన్పించింది. మొదట్లో డైలాగ్స్ తగ్గ నటన లేదు కానీ చివరికి వచ్చే సరికి రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అబ్బాయి కూడా తన ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నాడు. బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు అక్కడక్కడా ఫన్నీ సీన్స్ బాగున్నాయి.
లీడ్ రోల్ : నవీన్ అభి, కాజల్ కిరణ్
దర్శకత్వం : నరేశ్ కావటి
రివ్యూ: వినోద్ మామిడాల
7660066469
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 21,2018 12:36PM