కోజికోడ్: కేరళలో విస్తరిస్తున్న నిఫా వైరస్‌పై ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కేకే శైలజా టిచర్ స్పందించారు. దీనిపై ఇప్పటికే ఆర్యోగశాఖ తగిన చర్యలు చేపట్టిందన్నారు. పరిస్థితులపై ఆ శాఖ అధికారులు అప్రమత్తతో వ్యవహారిస్తున్నారని మంత్రి చెప్పారు. అయితే ఈ వైరస్ నేరుగా ఒక వ్యక్తి నుంచి మరోక వ్యక్తికి సోకడమే కాకుండా తాకడం, ఇతర మార్గాల ద్వారా ఈ వ్యాధికి గురికావడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వైరస్ సోకి ఇప్పటికే పలువురు మృతి చెందారు. దీనికితోడు ఈ వైరస్‌కి ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడమూ కొంత ఆందోళన కలిగించే అంశంగా తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm