హైదరాబాద్ : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కీలక సమరానికి సిద్దమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ విషెస్ తెలియజేశాడు. తన సారథ్యంలో 2016 సీజన్లో సన్‌రైజర్స్‌ను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో ఈ సీజన్‌కు దూరమైన వార్నర్ జట్టు టైటిల్ గెలవాలని పరితపిస్తున్నాడు. మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే కీలక సమరానికి ముందు ట్విటర్ వేదికగా జట్టుకు బెస్ట్ విషెస్ తెలియజేశాడు. ఈ రాత్రి సన్‌రైజర్స్‌కు అదృష్టం కలిసిరావాలి. హైదరబాద్ ప్రజలు గర్వించేలా చేయాలి అని వార్నర్ ఆకాంక్షించాడు. ఇక ఈ ట్వీట్‌కు హైదరాబాదీలు ఫిదా అయ్యారు. నిన్నెంతో మిస్సయ్యాం చాంప్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm