రియో డిజనీరో: ఒకేసారి తన ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాడు బ్రెజిల్ మాజీ సాకర్ స్టార్ రొనాల్డినో. ఇదో పెద్ద అబద్ధం అని అతను స్పోర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 38 ఏళ్ల రొనాల్డినో వచ్చే ఆగస్ట్‌లో తన ఇద్దరు గర్ల్ఫ్రెండ్స్నూ ఒకేసారి పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. రియోకి చెందిన ఒ డియా అనే పత్రిక ఈ విషయం వెల్లడించింది. ప్రిసిల్లా కొయెలో, బీట్రిజ్ సౌజాలను రొనాల్డినో పెళ్లి చేసుకోబోతున్నాడని ఆ పత్రిక తెలిపింది.
గత డిసెంబర్ నుంచి ఈ ముగ్గురూ కలిసే ఉంటున్నట్లు కూడా చెప్పింది. ప్రిసిల్లాతో 2013 నుంచి, బీట్రిజ్తో 2016 నుంచి రొనాల్డినో డేటింగ్ చేస్తున్నాడు. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని రొనాల్డినో సోదరి.. తాను వేడుకకు హాజరు కాబోనని కూడా చెప్పినట్లు మరికొన్ని వార్తలు వచ్చాయి. బ్రెజిల్ టీమ్ తరఫున రొనాల్డినో 97 మ్యాచ్‌లు ఆడాడు. మిడ్‌ఫీల్డర్ అయిన అతడు 33 గోల్స్ కూడా చేశాడు. 2002లో వరల్డ్‌కప్ గెలిచిన టీమ్‌లో రొనాల్డినో సభ్యుడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- May 25,2018 07:31PM