లండన్: నగరంలోని చారింగ్ క్రాస్ రైల్వే స్టేషన్లో తాను బాంబుతో ఉన్నట్లు చెప్పిన వ్యక్తిని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటన రైల్వే స్టేషన్లో ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఒక వ్యక్తి తన దగ్గర బాంబు ఉందని చారింగ్ క్రాస్ రైల్వే స్టేషన్లో హడావుడి సృష్టించాడు. దీంతో రైల్వే స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం స్టేషన్కు ప్రయాణికులు ఎవరూ రావడం లేదు. సమస్య పరిష్కరమైనందున స్టేషన్ను తిరిగి ప్రారంభించేందుకు మేము ప్రయత్నిస్తున్నాము అని బ్రిటిష్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు చెప్పుకొచ్చారు. స్టేషన్లో రికార్డైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్టేషన్లో చాలా మంది మిలిటరీ అధికారులు గస్తీ కాస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. దీంతో బ్రిటన్లో తీవ్రవాదుల కదలికలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm