హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ మంత్రి, సీనియర్ నేత దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ పెద్దలకు పంపడం జరిగింది. అయితే ఆయన హస్తాన్ని వీడిన అనంతరం కారెక్కుతారనే గుసగుసలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో దానం భేటీ అయ్యారు.! ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తలసానితో ఆయన మంతనాలు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో దానం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారని స్పష్టంగా తెలుస్తోంది. కాగా.. భేటీ అనంతరం తలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడతారని సమాచారం. రాజీనామాకు గల కారణాలను శనివారం రోజు మీడియా ముందు వెల్లడిస్తానని నాగేందర్ స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 22,2018 07:35PM