హైదరాబాద్ః కులం, మతం, పరువు, మర్యాదల పేరుతో సమాజంలో జరుగుతున్న కులదురహంకార హత్యల నేపథ్యంలో చిత్రీకరించిన లఘుచిత్రం 'ఇస్త్రీపెట్టే'. ఇద్దరి మధ్యలో పుట్టిన ప్రేమకు వర్గబేధాలుండవు. కులం, మతం తేడాలు అంతకన్నా ఉండవు. కానీ పట్టించుకునేదంతా తల్లిదండ్రులే. చిన్నకులం, పెద్దకులం అంటూ కులదురంహంకార హత్యలకు సైతం దిగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పరువునే ముఖ్యంగా భావించి బిడ్డల్ని సైతం లెక్క జేయని అగ్రకులస్తులనూ చూస్తున్నాం. ఈ చిత్రంలో ముస్లిం యువతి జరీనా, ఆ ఊరి పటేల్ కొడుకు ప్రేమించుకుంటారు. కానీ ఇద్దరి పెండ్లి అసాధ్యమనుకుంటారు. వారి ఇంటి పెద్దలు పరువు మర్యాద కోసం ఎంతకైనా తెగించే రకంగా భావిస్తారు. వారి ప్రేమ సంగతి పెద్దలకు చెప్పడానికి భయపడతారు. చనిపోయి అయినా ప్రేమను బతికించుకుందాం కానీ ఎవరికీ చెప్పకుండా పెండ్లి చేసుకుని వారి కుటుంబాల పరువు తీయొద్దని ఆ యువకుడు జరీనాకు ఉత్తరం ద్వారా తెలియజేస్తాడు. కానీ ఉత్తరం జరీనాకు చేరకముందే కులవృత్తిచేసుకునే ఓ వ్యక్తికి చేరుతుంది. ప్రేమికుల నిర్ణయం ఇతనికి తెలిసి వారి యువకుని తండ్రి పటేల్‌కు తెలయజేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ చిన్నకులం, పెద్దకులం అని పరువుతో ఉండే అతని వ్యక్తిత్వం చూసి చెప్పడానికి ధైర్యం చేయడు. ధైర్యం తెచ్చుకుని చివరికి ఓ రోజు పటేల్ దగ్గరకు వెళ్లి ఈ విషయం తెలియజేస్తాడు. పటేల్ కోపంతో రగిలిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందనేది చిత్రంలో చూడండి. ఉత్తరం చదివిన వ్యక్తి ఎవరో, ఇద్దరి ప్రేమ కథలో, కుటుంబాల భవిష్యత్తులో కీలకంగా ఎందుకు, ఎలా మారతాడో సినిమా చూస్తే అర్థమవుతుంది.
కథ, దర్శకత్వం : సాహిత్య ప్రకాశ్
నటీనటులు : ఐరేని మురళీధర్ , కృష్ణమూర్తి, గిరిబాబు, ఆమని
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 24,2018 11:44AM