అమ్మాయి టీసీఎస్‌లో జాబ్. అబ్బాయి జాబ్‌లెస్. సినిమాలో మనోడు బీటెక్. అసలే సిక్స్ ఇయర్స్. ఇంకే కంపెనీలో జాబ్ ఇస్తారు. ట్రై చేస్తాడు ఫుల్‌గా ఇటు అమ్మాయి కీర్తనకు, ఏదో కంపెనీలో జాబ్‌కి. రోజూ ఇంటర్వ్యూ కి వెళ్తున్నప్పుడు టీ కొట్టుదగ్గర కూర్చుని టీ తాగుతూ కీర్తనకు సైట్ కొట్టడం మనోడి పని. ఇలా రోజులు గడుస్తారు. ఉన్నట్టుండి ఆ అమ్మాయి మనోడు విజరుని పలకరిస్తుంది. మనోడ్ షాక్. అసలే బీటెక్, అందులో జాబ్స్ కోసం సెర్చింగ్.. అమ్మాయిని ఇంప్రెస్ చేసేలా మాట్లాడటానికి ఇంకేం కావాలి. చకచకా మాట్లాడతాడు. 'నాకు సైట్ కొట్టేకంటే ముందు జాబ్ కొట్టండి'. అంటూ సెటైరికల్ గా మాట్లాడి మనోడి మనసునింకా దోచిస్తుంది. చివరికి వెళ్తూ వెళ్తూ తన నెంబర్ ఇచ్చి, జాబ్ వస్తే ఫోన్ చేయాలని, హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్లలో నేనూ ఒకదాన్ని అని చెప్పి వెళ్తుంది. జాబ్ కొట్టి కీర్తన చేయిపట్టుకోవాలని మనోడి కల. నానాతంటాలు పడి జాబ్ కొడతాడు. అ జాబ్ వచ్చిన సంగతి కీర్తనకు ఫోన్ చేయగానే వచ్చి కలుస్తుంది. సేమ్ కంపెనీలోనే జాబ్ వచ్చినట్టు చెప్పడంతో కీర్తన్న సప్రైసింగ్గా ఫీలవుద్ది. ఇదీ కథ.. వాళ్లిద్దరి ప్రేమ ఏమద్దో మాత్రం చూపించలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అక్ట్రాక్టివ్గా ఉంది. సినిమా మొదటినుంచి కామేడీగా ఉంది చూడొచ్చు.
షార్ట్ఫిలిమ్ : బీటెక్ సిక్స్ ఇయర్స్
కథ, దర్శకత్వం : పృథ్వికుమార్ కామెపల్లి
లీడ్ రోల్ : కుమార్ కసారం, క్రిస్టెన్ రవళి
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jun 24,2018 11:53AM