రియాద్ : సౌదీ అరేబియాలో మహిళలు వాహనాలతో రోడ్డెక్కారు. కార్లను డ్రైవ్ చేస్తూ, కేరింతలు కొడుతూ అర్ధరాత్రి సందడి చేశారు. కార్లకు బెలూన్లను కట్టి.. రోడ్లపై విహరిస్తూ.. షాపింగ్ చేస్తూ.. ఇతర మహిళలకు శుభాకాంక్షలు చెబుతూ ఎంజాయ్ చేశారు. ఇంతకీ మహిళలు ఇలా ఎందుకు సందడి చేస్తున్నారంటే.. సౌదీ అరేబియాలో మహిళల డ్రైవింగ్‌పై దశాబ్దాల కాలం నుంచి అమలులో ఉన్న నిషేధం ఆదివారంతో అధికారికంగా ముగిసిపోయింది. ప్రపంచంలో ఇలా మహిళల డ్రైవింగ్‌పై నిషేధం విధించిన ఏకైక దేశం సౌదీ అరేబియానే.
Mon Jan 19, 2015 06:51 pm