హైదరాబాద్: హైదరాబాద్లో రేషన్ డీలర్లతో సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్ సమావేశమయ్యారు. రేషన్ డీలర్ల సమస్యలపై సమావేశంలో కమిషనర్ అకున్ సబర్వాల్ వారితో చర్చిస్తున్నారు. పాత బకాయిలతో పాటు తమిళనాడు, కేరళలో ఇస్తున్న విధంగా జీతాలు ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. డీలర్ల ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయిస్తామని అకున్ సబర్వాల్ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm