ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రైమ్ డే సేల్ ను నిర్వహించనుంది. ఈ సేల్ 36 గంటల పాటు కొనసాగనుంది. కేవలం అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వారి కోసమే ఈ సేల్‌ను నిర్వహిస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా అనేక రకాల ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందివ్వనున్నారు. ఈ సేల్‌లో భాగంగా హెచ్డీఎఫ్సీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను ఇస్తారు. దీంతోపాటు అనేక రకాల ప్రొడక్ట్స్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.3వేల వరకు అదనపు డిస్కౌంట్‌ను అందిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 11:55AM