ఇప్పుడు ఎక్కడ చూసినా యూత్ లో అంతా కూడా ఃఆర్ ఎక్స్ 100ః సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన ప్రతి చోటున విజయవిహారం చేస్తోంది. రెండున్నర కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా ఫస్టు వీకెండ్ లోనే రెట్టింపు వసూళ్లను రాబట్టింది.
కార్తికేయ .. పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా అదే జోరును చూపిస్తూ ఉండటం విశేషం. దాంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం టీవీ చానల్స్ పోటీపడుతున్నాయట. ఈ సినిమాకి గల క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న నిర్మాత .. 6 కోట్ల వరకూ చెబుతున్నాడట. కుర్రకారు హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేస్తోన్న ఈ సినిమాకి మంచి రేటింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ గనుక, కాస్త అటు ఇటుగా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 12:03PM