పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది శృంగార తార సన్నీలియోన్. దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న సన్నీలియోన్ జీవితకథ ఆధారంగా ఓ వెబ్ సిరీస్ ప్రసారం అవుతోంది. దీనికి -కరణ్ జీత్ కౌర్- ది అన్‌టోల్డ్ స్టోరీ- అని పేరు పెట్టారు. సన్నీ లియోన్ అసలు పేరు కరణ్ జీత్ కౌర్ అనే సంగతి తెలిసిందే. వెబ్‌సిరీస్‌గా రూపొందుతున్న ఈ బయోపిక్‌పై పలు వివాదాలు ముసురుకుంటున్నాయి.
తాజాగా ఈ బయోపిక్ టైటిల్‌పై శిరోమణి గురుద్వార కమిటీ అభ్యంతరాలు లేవనెత్తింది. సన్నీలియోన్ బయోపిక్ టైటిల్లో -కౌర్- అనే పదాన్ని వాడడాన్ని ఆ కమిటీ తప్పుపడుతోంది. సన్నీలియోన్ తన జీవితంలో ఏనాడూ సిక్కు సిద్ధాంతాలను, పద్ధతులను పాటించలేదని, సిక్కు గురువుల ప్రబోధాలను వినలేదని, అందుకే ఆ బయోపిక్ టైటిల్లో -కౌర్- అనే పదం ఉండడాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని కమిటీ ప్రకటించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 01:11PM