హైదరాబాద్ : బిగ్ బాస్ లో అందరిలోకి సేఫ్ గేమ్ ఆడుతున్నది అమిత్.. పోయిన వారం భానుశ్రీ ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణం అమితే.. అమిత్ గనుక బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లకు ఒప్పుకుంటే ఈరోజు భాను ఎలిమినేట్ అయ్యేది కాదు.. ఇక పోతే ఈ సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిగ్ బాస్ జంటలు జంటలుగా ఇద్దరి చొప్పున ఎలిమినేషన్ టాస్క్ ఇచ్చాడు. దీప్తి నల్లమోతు-గణేష్ లను ఒక జంటగా పెట్టి వారిద్దరికి సంకేళ్లు వేశాడు. బాబు గోగినేని-రోల్ రైడాకు, సామ్రాట్-కౌశల్ కు, తనీష్-దీప్తిలకు సంకెళ్లు వేశారు. ఎవరు ఎలిమినేషన్ లోకి వెళ్లాలనుకుంటే వాళ్లు సంకెళ్లను విడిపించుకోవచ్చనే నియమం పెట్టారు. ఈ ఆసక్తికర టాస్క్‌లో గణేష్ వల్ల అమిత్ ఎలిమినేషన్ లోకి వెళ్లినట్టు తాజా ప్రోమోలో చూపించారు. దీనికి సీరియస్ అయిన అమిత్ ఏకంగా ఓ కోడిగుడ్డును తెచ్చి అమిత్ గణేష్ తలపై కొట్టాడు. వీడివల్లే తాను ఎలిమినేషన్ లోకి వెళ్లానని సీరియస్ అయ్యాడు. తన కోపం ఎలా ఉంటుందో చూడాలంటూ ఫైర్ అయ్యాడు. అమిత్ కొట్టడంతో గణేష్ ఏడ్చేశాడు. ఈ ఇంటిలో కుల్లు , కుతంత్రాలున్నాయని.. మీకు ఇష్టం లేకపోతే ఇంటికి వెళ్లిపోతానంటూ గుక్కపట్టి ఏడ్చేశాడు. ఇప్పుడీ తాజా వీడియోతో రాత్రి ఏ జరగబోతుందా అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm