చెన్నై: ఇళయ దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సర్కార్' ఈ చిత్రానికి ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడని కోలీవుడ్ సినీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో విజయ్ అమెరికాకు చెందిన టెక్ ఎగ్జిక్యూటివ్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంను చాలా కాలం తర్వాత అమెరికా నుండి చెన్నైకు వచ్చి రాజకీయాల్లో చేరిన టెక్ ఎగ్జిక్యూటివ్ ఏం చేశాడనే ఇతి వృత్తంతో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో విజయ్ పాత్ర గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జీవితానికి దగ్గరగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సన్‌పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. తమిళనాడుకు చెందిన రాజకీయ నేత కళ కరుప్పయ్య ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 16,2018 09:38PM