వానాకాలంలో ఉతికిన దుస్తులు తొందరగా ఆరవు. ఆరిన బట్టలను అల్మారాలో పెట్టినప్పుడు తడివాసన వస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు ఇల్లంతా కూడా దుర్వాసన వస్తుంది. తడివాసన వదలాలంటే, బట్టలు శుభ్రంగా ఉండాలంటే కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
- దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మజీవులు, ఫంగస్‌ను నిమ్మరసంలోని ఎసిటిక్ ఆమ్లం నిర్మూలిస్తుంది. సగం బకెట్ నీటిలో రెండు చెంచాల నిమ్మరసం కలిపి దుస్తులను అందులో ముంచి ఆరేయాలి. అలాగే నిమ్మరసం కలిపిన నీటితో ఇల్లును కూడా తుడవొచ్చు
- ఫంగస్‌ను నిర్మూలించే శక్తి వెనిగర్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇంట్లో దుర్వాసన వస్తుంటే... వెనిగర్ కలిపిన నీటిని ఇల్లంతా చల్లాలి. ఆ తరువాత తుడిచేయాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది.
- దుర్వాసన వచ్చే ప్రాంతాల్లో వంటసోడాను చల్లాలి. ఇలా చల్లిని పది నిమిషాల్లో దుర్వాసన, బ్యాక్టీరియా వంటివి నశిస్తాయి.
- ఇంట్లో ఉండే తేమను పీల్చేయడంలో ఉప్పు పాత్ర కీలకం. దాంతో పాటు దుర్వాసన సమస్యనీ నివారిస్తుంది. ఒక కాటన్ క్లాత్‌లో కొద్దిగా ఉప్పు వేసి మూటలా కట్టి దుర్వాసన వచ్చే చోట ఉంచితే సరిపోతుంది.ఇలా చేయడం వల్ల దుర్వాసన క్షణాల్లో మాయం అవుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 17,2018 09:28PM