హైదరాబాద్ : తమిళ నటి ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నారు. టివి సీరియల్స్‌తో పాటు ఆమె పలు విజయవంతమైన తమిళ సినిమాల్లో నటించారు. తమిళ్లో వంశం వంటి విజయవంతమైన సీరియల్స్‌లో కూడా ఆమె నటించారు. బుధవారం ఉదయం వలసరవక్కాంలోని తన ఇంట్లో మరణించి ఉండడాన్ని పనిమనిషి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు నెలలుగా ప్రియాంక భర్తకు దూరంగా ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jul 18,2018 11:58AM