హైదరాబాద్ : అక్కినేని నాగార్జున, నాచురల్ స్టార్ నాని హీరోలుగా వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'దేవదాస్'. ఈ చిత్రంలో రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా' అనే పాత పాటతో మొదలైన ఈ ట్రైలర్ రెండు నిమిషాల ఆరు సెకన్ల నిడివితో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'చీర్స్ కొట్టకుండా తాగేసావేంట్రా' అంటూ నాగార్జున, నానితో అనడం ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలో, నాని డాక్టర్ పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్య సాగిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటూ.. నెటిజన్లు అంటున్నారు. రష్మిక, ఆకాంక్షల అందాలు ట్రైలర్‌కి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm